కన్నుమూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు

14:42 - December 1, 2018

అమెరికా 41వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ హార్బర్ వాకర్ బుష్ అనారోగ్యంతో మృతిచెందారు. ఈయనను సీనియర్ బుష్ గా అమెరికాలో పిలుస్తుంటారు.  శుక్రవారం రాత్రి 10 గంటల 10 నిమిషాలకు ఈయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. 1989 నుంచి 1993 వరకు జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని కళ్లారా చూసిన  అమెరికా అధ్యక్షుడిగా ఈయన పేరు పొందారు. సీనియర్ బుష్ భార్య బార్బరా 8 నెలలకే కిందటే ఏప్రిల్ 17న చనిపోయింది. ఆమె మరణం సీనియర్ బుష్ ను కృంగదీసింది. ఆమె అంత్యక్రియల్లో బుష్ కన్నీరు మున్నీరుగా విలపించడం వైరల్ అయ్యింది. అంత్యక్రియలప్పుడే అస్వస్థతకు గురైన బుష్ ఆ తర్వాత కోలుకోలేదు. అప్పటి నుంచి మనోవేధనతో అనారోగ్యం పాలైన బుష్ శుక్రవారం చనిపోయారు. సీనియర్ బుష్-బార్బారాది ప్రేమ వివాహం. సీనియర్ బుష్... ఈ మధ్యకాలంలో అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించిన జార్జ్ డబ్ల్యూ బుష్ కు స్వయానా తండ్రి. జార్జ్ బుష్ కు ఐదుగురు పిల్లలు.. 14మంది మనవళ్లు - మనవరాళ్లు.. మునిమనవళ్లు ఉన్నారు. జార్జ్ బుష్ సీనియర్ అమెరికా అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేశారు. మూడు దశాబ్ధాల కింద ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే ఇప్పటికీ అమెరికాలో కొనసాగుతున్నాయి. మంచి పరిపాలన దక్షుడిగా సీనియర్ బుష్ కు ప్రజల్లో ఆదరణ ఉంది.  బుష్ మరణంతో అమెరికా ప్రభుత్వం సంతాప దినాలను ప్రకటించింది.