కట్నం అడిగినందుకు పెళ్లికొడుకుని...

11:24 - October 22, 2018

కట్నం తేలేదని పెళ్లి కూతురులని వేదించి చిత్రవద చేసే పరిణామాలు సాధారణంగా జరుగుతుంటాయి. కానీ కట్నం అడిగాడని పెళ్లికొడుకుని ఏం చేశారో తెలుసా...? పెళ్లి కొడుకును కట్టేసి శిరోముండనం చేశారు.వివరాల్లోకి వెలితే...ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాకు చెందిన అబ్దుల్లా కమాల్ తన పెళ్లి సందర్బంగా లక్నోలోని ఖుర్రం నగర్‌లోని కల్యాణ మండపానికి బంధువులతో సహా వచ్చాడు. పెళ్లి తంతులో భాగంగా వరుడు కట్నం కింద ఆడపెళ్లివారిని మోటార్ సైకిల్ అడిగాడు. అయితే అందుకు వారు నిరాకరించడంతో మగపెళ్లివారు తిరిగి వెనక్కు వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. దీంతో ఆడపెళ్లివారు ఆగ్రహం వ్యక్తంచేస్తూ, అతనిని తాళ్లతో బంధించారు. తరువాత వారంతా కలిసి వరునికి శిరోముండనం చేసి, పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది.