కండ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే...

11:06 - August 21, 2018

కండ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు పోవాలంటే ఈ క్రింది చిట్కాలను పాటిస్తే చాలు.

- పుదీనా ఆకులను పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని కండ్ల కింద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. 

- టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, కీరదోస రసం కలుపుకుని కండ్ల కింద నల్లటి వలయాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వలన నల్లటి వలయాలు తొలగిపోయి కాంతివంతమైన ముఖాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. 

- బాదం నూనెను కండ్ల చుట్టూ రాసుకుని 5 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కాటన్‌తో తుడిచేయాలి. ఇలా చేస్తే కూడా నల్లటి వలయాలు తొలగిపోతాయి.

- కొద్దిగా పసుపులో మజ్జిగను కలుపుకుని ఆ మిశ్రమాన్ని కండ్ల చుట్టూ రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చును.