ఒక మంచి అబ్బాయిని చూడమని చెప్పా!

11:14 - November 21, 2018

నేను ఎందుకు సింగిల్‌గా ఉన్నానో ఇప్పటికీ నాకు తెలీదు అని చెబుతోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆమె మాట్లాడుతూ ....ప్రతి రోజూ సాయంత్రం కాగానే నా స్నేహితుల్ని '  మీరు ఎందుకూ పనికిరారు '  అని తిడుతుంటా! ఎందుకంటే నాకొక మంచి పార్టనర్‌ని చూడమని ఎప్పుడూ వాళ్లకి చెబుతుంటా. కానీ వాళ్లు ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అమ్మ ఏమో.. పెళ్లి వయసు దాటిపోతుంది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అంటోంది. ప్రేమ, పెళ్లి అంటే నాకూ ఇష్టమే. ముంబై, హైదరాబాద్‌లోని స్పేహితులందరికీ మంచి అబ్బాయిని చూడమని చెప్పా. వారు అదే పనిలో ఉన్నారని అమ్మకు చెప్పాను అని రకుల్‌ తెలిపారు.