ఒక గ్లాసు బీట్‌రూట్‌ రసంతో...

16:50 - August 27, 2018

టెన్షన్‌ లేకుండా రోజు గడవాలంటే మానసికారోగ్యంతో పాటు శారీరకారోగ్యం కూడా ఎంతో అవసరం. దీనికోసం రోజులో కొద్దిసేపన్నా వ్యాయామం చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే వ్యాయామం చేయటానికి ముందు ఓ గ్లాసు బీట్రూట్‌ రసం తాగి చూడమంటున్నారు అమెరికా పరిశోధకులు.

 బీట్రూట్‌లో లభించే 'నైట్రేట్‌'.. వ్యాయామం చేసేప్పుడు శరీరం త్వరగా అలసిపోకుండా ఉండడానికీ, మెదడుకు రక్త సరఫరా మెరుగుపరచడానికి తోడ్పడుతుందని పరిశోధకులు వెల్లడించారు. వ్యాయామానికి ముందు బీట్రూట్‌ రసం తాగడం వలన మెదడు భాగాలు ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బీట్రూట్‌లో లభించే 'నైట్రేట్‌'.. వ్యాయామం చేసేప్పుడు శరీరం త్వరగా అలసిపోకుండా ఉండడానికీ, మెదడుకు రక్త సరఫరా మెరుగుపరచడానికి తోడ్పడుతుందని పరిశోధకులు వెల్లడించారు. మెదడుకు మరింత ఎక్కువగా ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చేస్తుందని వారు చెబుతున్నారు. గతంలో చేసిన అనేక పరిశోధనల్లో బీట్రూట్‌ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వలన రక్తపోటు అదుపులో ఉంటుందన్న విషయం స్పష్టమైంది.

అనేక పరిశోధనల ఫలితాలను గమనించిన తర్వాత ఆహార నిపుణులు మెదడుకు మేలు చేసేదే కనుక బీట్రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిదని సూచిస్తున్నారు.