ఒక కొలిక్కి వచ్చిన ప్రణయ్ హత్య కేసు!

11:51 - November 1, 2018

కులం పేరుతో అతి కిరాతకంగా నరికి చంపిన ప్రణరు హత్య రాష్ట్రంలో ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషియమే. ఇప్పుడు ఆ హత్య కేసు ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్ర జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ ఎన్.మురళీబాబు, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్ హత్య కేసులో ఉన్న ఆరుగురు నిందితుల్లో ముగ్గురు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి మిర్యాలగూడ నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఏ1గా తిరునగరి మారుతీరావు, ఏ5గా ఎమ్డీ అబ్దుల్ ఖరీం, ఏ6 ఉన్న తిరునగరి శ్రవణ్ కుమార్‌లను బుధవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. వీరు సంవత్సర కాలం పాటు పీడీ యాక్ట్‌లో ఇక్కడే శిక్ష అనుభవిస్తారని తెలిపారు. జైలులో ఈ ముగ్గురికి వేర్వేలు బ్యారక్‌లు కేటాయించామని డీఐజీ మురళీబాబు తెలిపారు.