ఒక్క ట్విట్‌ జీవితాన్ని మార్చేసింది

15:12 - September 19, 2018

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది...అని అంటుంటాం. కానీ ఇప్పుడు ఒక్క ట్విట్‌ సినిమాటోగ్రఫీ  సంతోష్ శివన్‌ జీవితాన్ని మార్చేసిది. సంతోష్ శివన్..పలు సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీని అందించి తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు. ఈయన దేశంలోనే అత్యున్నత పురస్కాంర అయిన పద్మశ్రీని కూడా పొందిన విషయం తెల్సిందే.  సంతోష్ శివన్‌ తాజాగా  చేసిన ఒక ట్వీట్ ఆయన కెరీర్ నే ముంచేసే స్థితికి తీసుకు వచ్చింది. ఈ సిఈ సినిమాటో గ్రాఫర్ ట్విట్టర్ లో ఒక మెమెను పోస్ట్ చేయడం జరిగింది. కూడా సుపరిచితఅందులో నిర్మాతలు పారితోషకం ఇచ్చేటప్పుడు ఎలా వుంటారో చూపించాడు. టెక్నీషియన్‌లకు ఇచ్చేటప్పుడు ఎలావుంటారో, హీరోహిన్స్‌కు ఇచ్చేటప్పుడు ఎలావుంటారో కుక్క ద్వారా చూపించారు.  రెండు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిన కుక్క ఫొటోలను పోస్ట్ చేసి కోపంగా ఉన్న కుక్క బోమ్మపై ఇది టెక్నీషియన్స్ కు పారితోషికం ఇస్తున్న సమయంలో - నవ్వుతూ ఉన్న కుక్క ఫొటో పై ఇది హీరోయిన్స్ కు పారితోషికం ఇస్తున్న సమయంలో నిర్మాతల ఫీలింగ్ అంటూ  ఉంది.  ఆ మెమె వివాదానికి కారణం అవ్వడంతో వెంటనే దాన్ని తొలగించాడు. అప్పటికే నష్టం జరిగిపోయింది.

ఈ విషయాన్ని తమిళ నిర్మాతలు చాలా  సీరియస్‌గా తీసుకున్నారు. ఒక ప్రముఖ టెక్నీషియన్ అయ్యి ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడంపై నిర్మాతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయమై మండలిలో ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నేడు తమిళ నిర్మాతల మండలి భేటీ కాబోతుంది. ఈ భేటీలో సంతోష్ శివన్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.