ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1400 మంది మాత్రమే!

11:36 - November 22, 2018

ఈసారి ఒక్కో ఎన్నికల కేంద్రంలో గరిష్టంగా 1400మంది ఓటర్లు మాత్రమే ఉండాలట!. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా వెలువడిన నిబంధన ఇది. అదేంటీ 1400 మాత్రమే ఎందుకుండాలి అను అనుకుంటున్నారా? అయితే అసలు విషియానికి వద్దాం... ఈ ఎన్నికల్లో ఈవీఎంలకు వీవీ ప్యాట్ కూడా అనుసంధానమై ఉంటుందని తెలుసుగా? మనం ఎవరికి ఓటు వేశామన్నది వీవీ ప్యాట్ లో కనిపిస్తుంది. ఇందులోని థర్మల్ పేపర్, ఓటు పడిన గుర్తును చూపించి, ఆపై దాన్ని అందులోనే వేసేస్తుంది. వీవీ ప్యాట్ లో అమర్చిన థర్మల్ పేపర్, 1500 ఓట్ స్లిప్పుల ముద్రణకు మాత్రమే సరిపోతుంది. వీటిలో ఓ 100 స్లిప్పుల వరకూ నమూనా పోలింగ్ ప్రక్రియ క్రమంలో ఖర్చయిపోతాయి. అందువల్లే ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 1,400 మంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉండకుండా చూశారు అధికారులు.