ఐరోపాకు వెళ్తున్న అరవింద సమేత వీర రాఘవ

12:44 - September 4, 2018

ప్రస్తుతం ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం ' అరవింద సమేత వీర రాఘవ '. ఈ సినిమా దసరాకు ప్రేక్షకులను అలరించబోతుంది. అయితే ఈ సినిమాలో కొంత టాకీ పార్ట్ - మూడు పాటల చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది.  ఈ మూడు పాటల్లో ఒక పాటను మాత్రం యూరోప్ లో చిత్రీకరిస్తారట.  మిగతా రెండు పాటలను హైదరాబాద్ లో నే సెట్స్ వేసి చిత్రీకరణ జరుపుతారట . సెప్టెంబర్ 20 కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి మిగతా పది రోజుల్లో రెండు పాటలను ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ ను వెంటనే మొదలు పెట్టి విదేశాల్లో చిత్రీకరించిన పాటను లాస్ట్ మినిట్ లో సినిమాలో కలిపేలా  త్రివిక్రమ్ & టీమ్  ప్లాన్ చేసుకున్నారట.

ప్రేక్షకులకు ఒక్క పాటైనా ఫారెన్‌ లోకేషన్‌లో లేకపోతే...సినిమాను వెంటనే చుట్టేసినట్లనిపిస్తుందని..ఒక  పాటను మాత్రం ఎగ్జోటిక్ లోకేషన్స్ లో చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకున్నారట.