ఐదు రాష్ట్రాల్లో బొక్క బోర్లా పడ్డ బీజేపీ

12:54 - December 12, 2018

ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎవరు ఏ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నారో తేటతెల్లమైంది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లోని రాజస్తాన్- మధ్యప్రదేశ్- చత్తీస్ ఘడ్ ఫలితాల పై ఆసక్తి నెలకొంది. ఇక్కడ  పొత్తులు లేకుండా కాంగ్రెస్- బీజేపీ పోటాపోటీ గా తలపడ్డాయి. కాంగ్రెస్ విజేతగా నిలిచింది.  అయితే గట్టిపోటీనిస్తామని భావించిన ఆమ్ ఆద్మీ-  సమాజ్ వాదీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు తేలిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇవి కనీస ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఈ సారి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని భావించిన ఆమ్ ఆద్మీ- సమాజ్ వాదీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కనీసం నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా తెచ్చుకోకపోవడం విస్తుగొలిపింది. ఇదిలా వుంటే...నోటాకు వేసిన ఓట్లు ఈ పార్టీలకు పడలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.వీటి సంగతి ఇలా వుంటే..బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది.  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ బొక్కా బోర్లా పడింది. ఈ దెబ్బకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ- మిజోరంలో ప్రాంతీయ పార్టీలు గెలువగా.. రాజస్తాన్- మధ్యప్రదేశ్- చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. ఇప్పటివరకూ అప్రతిహతంగా సాగిన బీజేపీ గెలుపు యాత్రకు మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వడంతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద నాయకులెవరూ లేకుండా పోయారు. దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ కార్యాయలం వద్ద ఏర్పాటు చేసిన బారీ కేడ్లను కూడా పోలీసులు తొలగించడం విశేషం.