ఎప్పుడో పెళ్లయింది...కానీ కానట్టే వుంటున్నారట!

11:51 - November 10, 2018

సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార మిగతా స్టార్ హీరోయిన్ల కంటే చాలా భిన్నం. కంటెంట్ తప్ప స్టార్లను చూడకుండా సినిమాలు చేయడంతో వరస సక్సెస్ లు వస్తున్నాయి. దీంతో  సౌత్ లోనే హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా మారింది. అంతేకాదు ఈమె లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో కూడా సక్సెస్‌ సాధించింది. ఇదిలా వుంటే...ఈమె లవ్‌ స్టోరీల గురించి చెప్పుకోవాలంటే..అందరి హీరోయిన్ల లాగా తన లవ్ స్టొరీలను ఎప్పుడూ దాచుకోలేదు.  శింబుతో ప్రేమ వ్యవహారం ఓపెనే.. బ్రేకప్ కూడా అందరికీ తెలిసిందే.  సెకండ్ లవ్ స్టొరీ ప్రభుదేవా తో.  ఆ తర్వాత బ్రేక్ అప్ కూడా అందరికీ తెలిసిన విషయమే.  ఇక మూడో లవ్ స్టొరీ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఈ విషయంలో మాత్రం మునుపటిలా ఓపెన్ గా మాట్లాడడం లేదు.  జంటగా విహారయాత్రలు చేస్తారు.. ఫోటోలు దిగుతారు. ఇండైరెక్ట్ గా మేము లవర్స్ అంటూ హింట్స్ ఇస్తారు. కానీ తమిళ మీడియా మాత్రం నయన్-విఘ్నేష్ లకు ఎప్పుడో పెళ్ళయిపోయిందని.. ఇద్దరూ ఇప్పుడు భార్యాభర్తలని చాలా రోజులనుండీ మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ నయన్ మాత్రం ఈ విషయం పై పెదవి విప్పడం లేదు.