' ఎన్‌జీకె '... దీపావళి తర్వాతనే...

14:08 - August 31, 2018

 సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘ఎన్‌జీకే’ దీపావళికి రావాలి. కానీ ఈ సినిమా దీపావళి తర్వాత రిలీజ్‌ అవుతుందని చిత్రబృందం తెలిపింది. సూర్య హీరోగా దర్శకుడు సెల్వ రాఘవన్‌ తెరకెక్కిస్తున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘ఎన్‌జీకే’(నంద గోపాల కుమారన్‌ అని అర్థం). యస్‌.ఆర్‌ ప్రభు, యస్‌. ఆర్‌ ప్రకాశ్‌బాబు నిర్మిస్తున్నారు.  తొలుత ఈ సినిమాను దీపావళి స్పెషల్‌గా రిలీజ్‌ చేద్దాం అని ప్లాన్‌ చేసింది చిత్రబృందం. అయితే దర్శకుడు సెల్వ రాఘవన్‌ స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో షూటింగ్‌ డిలే అయింది. దాంతో దీపావళికి రావడం లేదని అనౌన్స్‌ చేశారు. 

 ‘‘మా ప్రొడక్షన్‌ హౌస్‌ చేస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎన్‌జీకే’. అద్భుతమైన ఎంటర్‌టైనర్‌ ఇవ్వబోతున్నాం అనే నమ్మకం మాకుంది. ప్రాజెక్ట్‌ బాగా రావడానికి మా టీమ్‌ రేయి, పగలు కష్టపడుతున్నాం. కరెక్ట్‌ డేట్‌ త్వరలోనే అనౌన్స్‌ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సూర్య ఇందులో ఎమ్మెల్యేగా కనిపించనున్నారని సమాచారం.