ఎన్నికల బరిలో ఎన్టీఆర్‌ ఉండబోతున్నారట!

14:32 - September 27, 2018

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎన్నికల బరిలో ఉండబోతున్నారట! అవునండీ మీరిన్నది నిజమే... ఆశ్చర్యంగా వుందా...అంత ఆశ్యర్యం అక్కర్లేదులేండి. ఎందుకంటే రియల్‌ లైఫ్‌లో కాదండీ...సినిమాలో...ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అరవింద సమేత సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో భారీ పొలిటికల్ ఎపిసోడ్ కూడా ఉంటుందని సమాచారం. దీంతో ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్ ఎన్నికల బరిలో కూడా నిలుపుతారనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ హావభావాలు, ఎన్నికల ప్రసంగాలను అధ్యయనం చేసిన త్రివిక్రమ్ భారీ పొలిటికల్ ఎపిసోడ్ కూడా పెట్టాడని సమాచారం.