ఎన్టీఆర్‌ మరోసారి ద్విపాత్రలో కనిపిస్తారట...!

12:24 - October 4, 2018

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ' అరవిందర సమేత వీరరాఘవ ' రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 11న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి. అయితే ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రలో కనిపిస్తున్నారని సమాచారం. తండ్రిగా, కొడుకుగా ఎన్టీఆర్‌ నటించారని తాజా టాక్‌. అయితే ముందు తండ్రి క్యారెక్టర్‌లో నాగబాబు వున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌ అని వినిపిస్తుంది. 
గతంలో డబల్‌ యాక్షన్‌లో ఎన్టీఆర్‌కు బాగానే కలిసొచ్చింది. అయితే ' ఆంధ్రావాలా 'లో తండ్రి, తనయుడు క్యారెక్టర్‌ 
చేేశారు. కానీ దాని తరువాత ' అదుర్స్‌ ' లో అన్నదమ్ముల క్యారెక్టర్‌ చేశారు. ఈ రెండు సినిమాలూ ప్రేక్షకులను బాగానే అలరించాయి. కాకపోతే ' ఆంధ్రావాలా ' కన్నా ' అదుర్స్‌ ' బాగా అలరించింది. దీన్ని బట్టి చూస్తే ' అరవింద సమేత ' లో కూడా మళ్లీ తండ్రి పాత్ర చేస్తున్నారు. మరి దీని రిజల్ట్‌ ఎలా వుంటుందో... వేచి చూడాల్సిందే.