ఎన్టీఆర్‌, ప్రభాస్‌ కలిసి పార్టీ ఇస్తున్నారట!...ఎందుకో తెలుసా?

12:08 - December 17, 2018

సినిమాల్లో కలిసి నటించినా నటించాకపోయినా బయట మన హీరోలు ఎంత సఖ్యత గా ఉంటారో తెలిసిందే . ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్  కలిసి సెపరేట్ గా ఒక స్పెషల్ పార్టీ ఇవ్వబోతున్నారట.  ఎవరి కోసమనా మీ డౌట్. రాజమౌళి వారసుడు కార్తికేయ పెళ్లి కోసం.  జనవరి 5న జరగనున్న వివాహ వేడుకను పురస్కరించుకుని వీరిద్దరూ కలిసి ఈ పార్టీని ఏర్పాటుచేస్తున్నారట!. ఇండస్ట్రీ లో ఉన్న హీరో హీరొయిన్లందరినీ ఒక చోటికి చేర్చి ఇప్పటిదాకా జరిగిన వాటిలో ఇదే బెస్ట్ అనిపించేలా సెలెబ్రేట్ చేయబోతున్నారట. ఎవరూ మిస్ కాకుండా అందరి దగ్గర ఖాళీగా ఉన్న డేట్ ని తీసుకుని ఫైనల్ గా ఒకటి ఫిక్స్ చేయబోతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ప్లానింగ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభోత్సవంలోనే జరిగిందట. దీనికి కారణం సింపుల్. అటు జూనియర్ కు ఇటు ప్రభాస్ కు ఇద్దరికీ రాజమౌళి తో బలమైన బాండింగ్ ఉంది. అదేంటంటే... రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ చేసింది తారక్ తోనే. ఆ తర్వాత సింహాద్రి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి జక్కన్నను స్టార్ గా మార్చేసింది. యమదొంగ రేపిన సంచలనం చిన్నది కాదు. అది ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో కొనసాగుతోంది. ఇక ప్రభాస్ కు ఛత్రపతి రూపంలో ఫస్ట్ మాస్ బ్రేక్ ఇచ్చిన రాజమౌళి బాహుబలి తో అతన్నో ఇంటర్నేషనల్ స్టార్ ని చేసాడు. అందుకే జక్కన్న అంటే ఈ ఇద్దరికీ ప్రత్యేకమైన అభిమానం. అది చూపించుకునే సందర్భం వచ్చేసింది కాబట్టి కార్తికేయ పెళ్లిని దాని కోసం వేదికగా మార్చుకోబోతున్నారు.