ఎన్టీఆర్‌కు నేను పోటీ ఏంటి...?- విజయ్ దేవరకొండ

11:05 - October 3, 2018

' అర్జున్‌ రెడ్డి ', ' గీతా గోవిందం ' తో విజరు దేవరకొండ స్టార్‌ ఇమేజ్‌ ఎక్కడికో వెల్లిపోయింది. ఇప్పుడు తాజాగా విజరు దేవరకొండ నటించిన చిత్రం ' నోటా ' ఈ నెల 5న రిలీజ్‌ అవుతున్న విషియం తెలిసిందే. అయితే ఈనెల 11న ' అరవింద సమేత ' కూడా రిలీజ్‌ కాబోతున్నది. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ విజరు దేవర కొండను లక్ష్యంగా చేసుకొని ట్రోల్స్‌ చేయడం మొదలు పెట్టారు. దీనిపై విజయ్ ఇప్పటికే ఒకసారి స్పందించాడు. తాజాగా ప్రముఖ క్రిటిక్ భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలోనూ ఈ విషయమై మాట్లాడాడు విజయ్. కొంచెం సుదీర్ఘంగానే అతను వివరణ ఇచ్చాడు. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సినిమా రాబోతుండగా.. ముందు వారం తన సినిమాను రిలీజ్ చేయడం వల్ల రిస్క్ తనకే అని.. నష్టం జరిగేది తన సినిమాకని విజయ్ అన్నాడు. ఈ విషయంలో భయపడి వెనక్కి తగ్గాల్సింది తామే అన్నాడు. ఐతే మీ సినిమా రిలీజ్ చేయొద్దు అని ఎవరైనా తనను ఆదేశిస్తే మాత్రం తాను విననని.. అలా అనే హక్కు ఎవరికీ లేదని విజయ్ స్పష్టం చేశాడు. ఎన్టీఆర్ సినిమాకు.. తన సినిమాకు అంతరం చాలా ఉందని.. తన సినిమా బడ్జెట్.. బిజినెస్ తో పోలిస్తే ఎన్టీఆర్ సినిమా పది రెట్ల స్థాయిలో ఉంటుందని.. అలాంటపుడు తాను ఎన్టీఆర్ కు పోటీ ఏంటని ప్రశ్నించాడు విజయ్. నిజానికి తన సినిమాను దసరా సెలవుల్లో రిలీజ్ చేయాలన్నది తన కోరిక అని.. ఎన్టీఆర్ సినిమాకు భారీగా థియేటర్లు వెళ్లిపోతాయి కాబట్టే దసరా సెలవుల్లో రిలీజ్ చేయలేక ముందుకు వచ్చినట్లు విజయ్ చెప్పాడు. అక్టోబరు 5 కూడా అభిమానుల పోల్ ద్వారా నిర్ణయించిన డేట్ అని విజయ్ చెప్పాడు.