ఎట్టకేలకూ బన్నీ నెక్స్ట్‌ సినిమా ఓకే అయింది

12:44 - December 14, 2018

బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌, కథ అన్నీ నచ్చి ఎట్టకేలకు బన్నీ నెక్స్ట్‌ సినిమాకు రంగం సిద్ధమయింది. బన్నీ నటించిన గత రెండు సినిమాలూ కూడా నిరాశే మిగిల్చినవి. అందుకే నెక్స్ట్‌ కొంత గ్యాప్‌ తీసుకోనైనా హిట్‌ కొట్టాలనుకున్నాడు. హిట్ పై ఎక్కువ భరోసా కావాలంటే త్రివిక్రమ్ తో చేయడమే కరెక్ట్ అనుకుని ఆయన కోసం వెయిట్ చేశాడు. తనపై బన్నీ పెట్టుకున్న నమ్మకానికి తగినట్టుగా త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేసి బన్నీకి వినిపించాడు. ఆయన చెప్పిన మార్పులు .. చేర్పులు చేసి పూర్తి స్క్రిప్ట్ తో బన్నీని ఒప్పించాడు. దాంతో ఈ సినిమాను జనవరిలో లాంచ్ చేయడానికి రంగం సిద్ధమైపోయింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఈలోగా నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయనున్నారు. హారిక అండ్ హాసిని ... గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం.