ఎక్కువసేపు కుర్చున్న చోటే...?

11:02 - August 18, 2018

ఆఫీసులో కదలకుండా కుర్చునే ఉద్యోగం చేయడమంటే చాలా సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకే దగ్గర ఎక్కువసేపు కుర్చునే వుంటే కచ్చితంగా మెడ నొప్పి, వెన్ను నొప్పి వస్తాయనీ...దీనికి తోడు రోజూ ఆఫీసు నుండి ఇంటికి చేసే ప్రయాణాలు ఇవన్నీ కూడా వీటికి తోడై ఆ ఉద్యోగికి బాగా కష్టమవుతుంది. అంతేకాక ఒత్తిడి నుండి బయటపడేందుకు తాగే, కాఫీ, టీ, బయట తినే తిండి ఇవన్నీ ఆరోగ్యం పై ఎంతో ప్రభావం చూపుతాయని వైధ్యులు చెబుతున్నారు.
ఇవన్నీ ఎదురవుతున్నా ఉద్యోగం మానెయలేరు. కాబట్టి కుర్చున్న దగ్గరే కొంచెం వ్యాయామం లాంటిది చేయాలి. ఆఫీసులో వ్యాయామం చేయాలా! అని ఆశ్చర్యపోకండి. దీనికి తక్కువ సమయం పడుతుంది. పనికి ఎటువంటి ఆటంకం కలగదు. ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఇప్పటికే సమస్యలు ఎదుర్కుంటుంటే దాని తీవ్రత పెరగకుండా జాగ్రత్తపడొచ్చు అంటున్నారు ఫిజియోథెరపిస్టులు.
ఎక్కువసేపు కుర్చోని పనిచేయడం వల్ల వెన్నుముక మీద విపరీతమైన దుష్ప్రభావం పడి మెడ నొప్పులు వస్తాయి. అలాగే డిస్క్‌, లిగమెంట్లకం జరిగే రక్తసరఫరాలో కూడా తేడా వస్తుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవాలంటే... మనం కుర్చున్న కుర్చీలోనే నిటారుగా కూర్చోవాలి. తరువాత రెండు భుజాలను ఒత్తిపెట్టి లోనికి శ్వాసతీసుకుంటూ వీపు కింది భాగాన్ని వంచాలి. శ్వాస బయటకు వదిలేటప్పుడు ముందుకు వాల్చాలి. ఈ విధంగా 20 నిమిషాలకు ఒకసారి ఐదు నుండి ఏడు సార్లు చేయాలి.
ఈ వ్యాయామంతో పాటు కండరాలకు బలానిచ్చే వ్యాయామం కూడా చేయొచ్చు. అదెలాగంటే.... నిటారుగా కుర్చోని మోకాళ్లను, కాళ్లను 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. తరువాత ఒక్కో పాదాన్ని నేలమీద గట్టిగా ఒత్తాలి. ఇలా ఒక్కొక్క పాదాన్ని ఐదు నుంచి ఏడు సార్లు చేయాలి. ఒక పాదాన్ని ఒత్తినప్పుడు ఒకటి నుండి ఐదు అంకెలు లెక్కబెట్టి తరువాత మరో పాదాన్ని ఒత్తాలి. ఈ విధంగా చేయడంతో కొంత రిలీఫ్‌ దొరుకుతుంది..