ఊహించని ట్విస్ట్‌ ఇస్తున్న కేజీఎఫ్‌

13:08 - December 24, 2018

ఎన్నో అంచనాలతో డిశంబర్‌ 21న విడుదలైన సినిమాలల్లో తెలుగు స్ట్రైయిట్‌ మూవీలు మాత్రం ప్రేక్షకులను నిరుత్సాహ పరిచాయి. ముఖ్యంగా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఎంతో నమ్మకం పెట్టుకున్న పడిపడి లేచే మనసు ఇంతగా నిరాశ పరుస్తుందని ఎవరూ ఊహించనిది. షారూఖ్‌ జీరోతో సహా మొత్తం ఐదు సినిమాలు బరిలో నిలిచి దేనికీ కూడా పాజిటీవ్‌ రెస్పాన్స్‌ రాకపోవడం ఆశ్చర్యం కలిగించినా..ఉన్నంతలో కేజీఎఫ్‌ బెటర్‌ టాక్‌తో వసూళ్లు రాబట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు.  డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కంటెంట్ పరంగా గొప్పగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ మాస్ కి దీన్ని మించిన ఛాయస్ లేకపోవడంతో ఓట్లన్నీ కెజిఎఫ్ లో రాకీ భాయ్ కె పడుతున్నాయి. నిన్న ఆదివారం హౌస్ ఫుల్స్ ఎక్కువగా రికార్డ్ అయిన మూవీస్ లో కెజిఎఫ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నిజానికి కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగులో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. వచ్చిన ఒకటి రెండూ కూడా ప్రేక్షకులు గుర్తించే లోపే వెళ్లిపోయాయి. అయితే కెజిఎఫ్ ఈ ట్రెండ్ ని బ్రేక్ చేసింది. అయితే మరి వరుణ్ తేజ్ అంతరిక్షం ఏమైంది అనే డౌట్ వస్తుంది కదా. స్పేస్ థ్రిల్లర్ అయినప్పటికీ సామాన్య ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా పూర్తి స్థాయిలో మెప్పించడంలో అంతగా సక్సెస్ కాలేకపోవడంతో దీని కలెక్షన్స్ మందకొడిగానే ఉన్నాయి. ఏదైతేనేం ఉన్నవాటిలో ఏది బెటర్ అనే యాంగిల్ లో కెజిఎఫ్ అడ్వాంటేజ్ తీసుకుంటోంది.