ఈ హీరోయిన్స్‌ ఇద్దరూ..ఒకే గూటి పక్షులు

15:23 - October 15, 2018

ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న ముద్దుగుమ్మల్లో పూజా హెగ్డే మరియు రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరు కూడా కర్ణాటకలో జన్మించారు. కాని వీరిద్దరు మాత్రం కన్నడ కంటే ఎక్కువగా తెలుగులో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. వీరిద్దరు చిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి స్టార్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నారు.  తెలుగులోనే వీరిద్దరికి మొదటి బ్రేక్ దక్కింది. పూజా హెగ్డే మాత్రం బాలీవుడ్ లో ఒక సినిమా చేసినా పెద్దగా అక్కడ పేరును దక్కించుకోలేక పోయింది. రష్మిక మాత్రం తెలుగు మరియు కన్నడంలో నటిస్తూ దూసుకు పోతుంది. పూజా హెగ్డే తెలుగులో ‘ఒక లైలా కోసం’ ‘ముకుందా’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రాలు పెద్దగా సక్సెస్ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యాయి. ఆ తర్వాత ‘డీజే’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డంను దక్కించుకుంది. ఇక రష్మిక విషయానికి వస్తే ‘ఛలో’ చిత్రం సక్సెస్ అయినా కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా రష్మిక స్టార్ డంను దక్కించుకుంది. ఈ కన్నడ ముద్దుగుమ్మలిద్దరు కూడా టాలీవుడ్ ప్రేక్షకులను ఏలేస్తున్నారు.