ఈ వారం నానీ..కౌశల్‌ వైపు వుంటారా? హౌజ్‌మెట్స్‌ వైపు వుంటారా?

14:01 - September 22, 2018

బిగ్‌బాస్‌ 2 ముంగింపు దశకు వచ్చింది. హౌస్లో ప్రస్తుతం 6గురు సభ్యులు మాత్రమే మిగిలారు. అయితే ఈ వారం జరిగిన టాస్క్స్‌, గొడవలుకు నానీ ఏ విధంగా, ఎవరిని మందలిస్తారో అన్నది అందరికీ ఆసక్తికరంగా వుంది. ఈ వారం హౌస్‌లో హౌస్‌మేట్స్ ఐదుగురూ కలిసి కౌశల్‌తో మాటల యుద్ధం చేశారు. మూకుమ్మడి మాటల దాడిలో మొదటి రోజు సంభాళించుకుని ఓపికగా సమాధానం చెప్పినప్పటికీ రెండో రోజు  ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక కుక్కల్లా మీద పడుతున్నారంటూ కౌశల్  మాట జారాడు. దీంతో హౌస్ రణరంగాన్ని తలపించింది. ఇది కాసేపు పక్కన పెడితే... గతంలో హిందీ బిగ్‌బాస్ షోలోనూ ఇలాంటి సీనే జరిగింది. అందేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే చూడండి.. నాడు కంటెస్టెంట్‌గా ఉన్న గౌతమ్ గులాటీని మిగిలిన కంటెస్టెంట్స్ అంతా కలిసి మూకమ్మడి దాడి చేసి రోజుల తరబడి వేధించారు. దీంతో బరస్ట్ అయిన గౌతమ్ అభ్యంతరకర పదాన్ని వాడేశాడు. అప్పుడు బిగ్‌బాస్ షో హోస్ట్ సల్మాన్ ఖాన్..గౌతమ్ గులాటీ వైపు చూస్తూ ఇంతటి మానసిక వేదన అనుభవించినపుడు అలాంటి పదాలే వస్తాయన్నారు. అంతేకాదు...మిగిలిన హౌస్‌మేట్స్‌ని వంతులవారిగా వాయించి వదిలిపెట్టారు. మరి ఇక్కడ నానీ ఏం చేస్తారు?..కౌశల్‌ని వాయించి.. హౌస్‌మేట్స్‌ని వెనకేసుకొస్తారాలేదంటే హౌస్‌మేట్స్‌ని వెనకేసుకొచ్చి కౌశల్‌ని వాయిస్తారాఅనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.