ఈ వారం ఎవరు వుంటారు? ఎవరు వెళ్తారు?

14:35 - September 8, 2018

బిగ్‌ బాస్‌ గురించి రోజు రోజుకూ ప్రేక్షకుల్లోనూ, ఇంటి సభ్యుల్లోనూ ఉత్కంఠ పెరిగిపోతుంది. ఎందుకంటే బిగ్‌ బాస్‌ ఫైనల్‌ దగ్గరపడుతోంది. దీంతో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో పెట్టే టాస్క్స్‌ లు కూడా చాలా కఠినంగా వుంటున్నాయి. అయినా సరే ఇంటిసభ్యులు వాటిని చాలా పోటా పోటీగా ఆడుతున్నారు.

కొన్ని యూట్యూబ్ ఛానళ్ల సర్వే ప్రకారం ఈవారం దాదాపు 20 కోట్ల ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ షోకి ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. అయితే సర్వే ప్రకారం వచ్చిన ఓట్లలో ఈసారి కూడా 60 శాతానికి పైగా కౌశల్‌ కే పోలైనట్లు తెలుస్తోంది. అంటే కౌశల్‌ ఈ వారం ఎలిమలినేట్‌ అయ్యే చాన్సేలేదు. ఇకపోతే ఓటింగ్ పరంగా రెండో స్థానంలో దీప్తి నల్లమోతు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈమె దాదాపు 20శాతం ఓట్లను పొందినట్టు సర్వేలు చెబుతున్నాయి. దీంతో దీప్తి కూడా సేఫ్.

ఇక మిగిలింది శ్యామల, అమిత్‌. వీరికి ఓటింగ్‌ పోల్‌ కూడా సమానంగా వచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పుడు వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అవ్వాలి. కానీ ఇక్కడ హౌజ్‌లో వున్నవారి అభిప్రాయాలను తీసుకుంటే.. రోల్‌రైడా, సామ్రాట్‌, తనిష్‌ తప్పకుండా అమిత్‌కు మద్దతిస్తారు. దీప్తీ, గీతా మాధురీ లు శ్యామలకు మద్దతిస్తారు. ఇక ఇప్పుడు మిగిలింది కౌశల్‌ . ఒకవేల కౌశల్‌ అమిత్‌కు మద్దతిస్తే ..శ్యామల ఎలిమినేట్‌ అవుతుంది. అలాకాకుండా కౌశల్‌ శ్యామల కి మద్దతిస్తే మాత్రం బిగ్‌బాస్ మరింత ఇరకాటంలో పడతారు.  అంటే ఈ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుండి ఎవరు వెళ్తారు? ఎవరు ఉంటారు? అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.