ఈ రోజు ఎలిమినేట్‌ అయ్యేది ఆమేనట!

13:19 - September 27, 2018

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముంగింపుకు ఇంకా మూడు రోజులే వుంది. అయితే ఈ లోపు ఏదైనా జరగొచ్చు. అలాంటిదే ఈరోజు జరగబోతుందట!. ఈరోజు ఒకరు హౌజ్‌ నుండి వెల్లబోతున్నారని సామాజిక మాద్యమాల్లో ప్రచారం అవుతున్న వార్త. అయితే ఆ ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో కాదండీ దీప్తీ నల్లబోతు. అదేంటీ ఆమెకు నిన్నటివరకూ ఓటింగ్‌లో కౌశల్‌ తరువాత ఆమే ఉంది కదా... మరిప్పుడు ఆమెలా అవుతుందీ అనుకుంటున్నారా..అదే అసలు కొంప ముంచింది. ఆమె ఎలిమినేషన్‌కి కారణం ఫేక్ ఓటింగ్ అనే చర్చ నడుస్తోంది. మరి దీప్తి నిజంగా ఎలిమినేట్ అయ్యారా, లేదంటే ఇది రూమరా, అనే విషయం మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.