ఈ నెల 24 నుంచి ఓటర్ల నమోదు పక్రియ మళ్లీ ప్రారంభం : రజత్‌ కుమార్‌

14:32 - December 12, 2018

తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 24 నుంచి మళ్లీ ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పోలింగ్ ను నిర్వహించామని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.   ఫిబ్రవరి 14 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. తమ ఓటు హక్కు ఉందో, లేదో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని తెలిపారు. ఓటర్ లిస్టులో ఉన్న తప్పిదాలను సరిచేస్తామని చెప్పారు. ఓట్లు పోయిన వారంతా ఆన్ లైన్లో తిరిగి రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. 23 లక్షల ఓట్లు గల్లంతయ్యాయనే వార్తల్లో నిజం లేదని చెప్పారు.