ఈ చిత్రం అవినీతి రాజకీయ నాయకులను టార్గెట్‌ చేసిందట!

16:32 - October 27, 2018


శ్రీకాంత్ హీరోగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ సమర్పణలో టి. అలివేలు నిర్మించిన కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆపరేషన్ 2019` కంటెంట్ పరంగా పూర్తిగా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రజానుకూలంగా ఉంటుందని - ప్రజల తరపున పోరాటమిదని శ్రీకాంత్ తెలిపారు. ఈ చిత్రం నవంబర్ 9న రిలీజవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ తన స్వగృహంలో పాత్రికేయులతో ముచ్చటించారు. ఇది ఏ ఒక్కరినో టార్గెట్ చేసినది కాదు.. అధికార పక్ష విధానాలనే కాదు - ప్రతిపక్ష - విపక్షాల్లోని అవినీతి రాజకీయ నాయకుల్ని ఈ సినిమా టార్గెట్ చేసిందని తెలిపారు. కథ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ప్రత్యేకించి ఏ పార్టీని బేస్ చేసుకుని కాదు. ఎలక్షన్స్ సందర్భంగా ప్రజల్లో ఎవేర్ నెస్ పెంచడం కోసం చేసిన మూవీ ఇది. ఒక సామాన్య వ్యక్తి పొలిటీషియన్ అయితే అతను ఎదుర్కొనే పరిణామాలు ఎలా ఉంటాయి? ఏవిధంగా రాజకీయ నాయకులు చేసే పొరపాట్లు సమస్యల్ని తెస్తాయి? అన్న కోణంలో ఉంటుంది అని తెలిపారు.  ``అసలు ఈ సినిమా ఏ ఒక్క పార్టీనో టార్గెట్ చేయదు`` అని కథానాయకుడు శ్రీకాంత్ అంటున్నా.. కచ్ఛితంగా ఇది తెలంగాణలో అధికార పార్టీ తేరాసకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందన్న స్పెక్యులేషన్  రన్ అవుతోంది. ఇది ఆపరేషన్ దుర్యోధన మూవీకి సీక్వెల్ కానే కాదని శ్రీకాంత్ వెల్లడించారు. `ఆపరేషన్ 2019` లో శ్రీకాంత్ తో పాటు మంచు మనోజ్  ఓ కథానాయకుడిగా కనిపించనున్నాడు.