ఈ ఏడాది రాజుగారు లెక్కల్లో ఫెయిల్‌

13:22 - October 23, 2018

చాలా క్యాలికులేటెడ్ గా కథలను బేరీజు చేసి పక్కా ప్లాన్ తో సినిమాలు నిర్మిస్తారని పేరున్న దిల్ రాజు లెక్కలు ఈ ఏడాది పూర్తిగా తప్పాయి.  గత ఏడాది ఆరు సినిమాలతో కమర్షియల్ సక్సెస్ అందుకుని దాన్ని వేడుకలా చేసుకున్న దిల్ రాజు ఈ సంవత్సరం ఇప్పటి దాకా మూడు ఫ్లాపులు తన ఖాతాలో వేసేసుకున్నారు. రాజ్ తరుణ్ లవర్ ఆయనకే పెద్దగా నమ్మకం లేనట్టుగా ప్రమోట్ చేయడంతో ఫలితం కూడా అందుకు తగ్గట్టు వచ్చింది. కానీ సంప్రదాయాలు పెళ్లి విలువలు అంటూ ఎంతో ఆశించిన శ్రీనివాస కళ్యాణం సైతం తీవ్రంగా నిరాశపరచడం ఊహించనిది. ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే కూడా అదే దారిలో ఉన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో దీని రన్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. మొదటి వీకెండ్ లో కేవలం $204 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసిన ఈ మూవీ రోజు రోజుకి గ్రాఫ్ డౌన్ అవుతూ పోవడం అక్కడి బయ్యర్లను టెన్షన్ పెడుతోంది. పోటీ లేనప్పటికీ హలో గురు ప్రేమ కోసమే యుఎస్ లో ఇంత తీసికట్టుగా ఆడటం దిల్  రాజుకు ఇబ్బంది కలిగిం చేదే. 2018 హ్యాట్రిక్ ప్లాప్స్ తో దిల్ రాజు డల్ గా ముగించక తప్పలేదు.  మరి వచ్చే సంక్రాంతికి ఎఫ్2తో అయినా బోణీ కొడతాననే హాప్ తో ఉన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ లో ఎలాగూ మహేష్ మహర్షి ఉంది కానీ అది దిల్ రాజు సోలో ప్రొడక్షన్ కాదు కాబట్టి అందులో వాటా మాత్రమే వస్తుంది.