ఈసీ నుండి నోటీసులు అందుకున్న టీఆర్‌ఎస్‌

10:48 - October 27, 2018

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక తొలిసారిగా, అది కూడా అధికార పార్టీకి నోటీసులు జారీ అయ్యాయి. మంత్రుల నివాస ప్రాంగణంలో ఉన్న క్లబ్‌ హౌస్‌ను టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశాలకు వాడుకుంటున్నారంటూ ఈసీకి విపక్షాలు ఫిర్యాదుల చేశాయి. స్పందించిన ఈసీ దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా జనరల్‌ సెక్రటరీ కే కేశవరావుకు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదు వస్తున్న నేపథ్యంలో ఈ నోటీసులు చర్చనీయాంశమయ్యాయి.