ఈసారి ఇద్దరితో దేవరకొండ!

17:50 - October 11, 2018

తాజాగా విజయ్ దేవరకొండ సినిమా ' నోటా '. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. కారణాలు ఏవైనా కానీ...దేవరకొండకు కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. అయితే దేవరకొండ లైనప్‌లో ' టాక్సీడ్రైవర్‌ ', ' ' డియర్‌ కామ్రేడ్‌ ' సినిమాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే విజయ్ ఇప్పుడు తాజా చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ వుంటారట!. ఆ హీరోయిన్‌ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. వారు ఒకరు రాశీ ఖన్నా, మరొకరు ఐశ్వర్య రాజేష్‌. రాశి ఖన్నా మన తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు..మరి ఐశ్వర్య ఎవరు? సీనియర్ కమెడియన్ శ్రీలక్ష్మి ఉంది కదా.. ఆవిడ మేనకోడలే ఈ ఐశ్వర్య.   తమిళంలో 'వడ చెన్నై'.. 'ధృవ నట్చత్తిరం' సినిమాలలో నటించింది. తెలుగులో ఇదే ఆమె కు డెబ్యూ ఫిలిం. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇదో న్యూ ఏజ్ లవ్ స్టొరీ అని.. రీసెంట్ గా క్రాంతి మాధవ్ ఫుల్ స్క్రిప్ట్ తో విజయ్ దేవరకొండ ను ఇంప్రెస్ చేశాడని సమాచారం.