ఈరోజు బిగ్‌బాస్‌ షోలో నాగార్జున...

14:46 - September 23, 2018

బిగ్‌బాస్‌ సీజన్‌ 2కి ఇంకొక వారంతో శుభం కార్డు పడునుంది. అయితే ఈ వారం హౌజ్‌లో జరిగిన గొడవలకు..శనివారం నానీ ఎవరిని ఏమంటారో అని ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. కానీ నానీ అందరినీ కొంచెం మందలించినట్లుగా చేశారు. అదే సమయంలో కౌశల్‌ని శాంత పరిచాడు. అయితే ఈరోజు ఎవరు ఇంటి నుంచి వెళ్తారా అన్నది అందరిలో వున్న ఆసక్తికరమైన ప్రశ్న. ఇదిలావుంటే... ఈరోజు షోకు నాగార్జున సందడి చేయబోతున్నారు. 'దేవదాస్ ' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ షోకి వచ్చిన నాగ్.. దేవగా ప్రేక్షకులను అలరించారు. దేవదాస్ మూవీలో దేవగా నాగ్, దాస్‌గా నాని నటించారు. షోకి వచ్చిన దేవ.. ' మీ అందరిలో ఎవరో మా దాస్‌ని ఇబ్బంది పెడుతున్నారట. ఇందులో(గన్‌) కరెక్ట్‌గా ఆరు(బుల్లెట్స్) ఉన్నాయి'' అంటూ సందడి సందడి చేస్తున్న ప్రోమోను సదరు ఛానల్ విడుదల చేసింది.