ఇల్లీ బేబీకి పెళ్లి అయినట్టేనా?

15:53 - November 12, 2018

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టి అక్కడా మంచి మంచి అవకాశాలందుకున్న కథానాయిక ఇలియానా. తెలుగులో ఉన్నన్ని రోజులూ కూడా ఇలియానాపై  ఏ రోజూ కూడా ఫలానా హీరోతో ఎఫైర్ అన్న రూమర్లు రాలేదు. ఇక మీడియా ముందు చాలా ఒద్దికగా మాట్లాడేది. కానీ బాలీవుడ్ కు వెళ్లాక చాలా బోల్డ్ గా తయారైంది. సెక్స్ సహా అనేక విషయాలపై చాలా ఓపెన్ గా మాట్లాడేసింది. అలాగే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో సహజీవనం చేస్తూ వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఆండ్రూను ఇలియానా పెళ్లి చేసుకోబోతున్నట్లు.. పెళ్లి చేసేసుకున్నట్లు.. గర్భవతి కూడా అయినట్లు.. గత కొంత కాలంగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇదిలా వుంటే ఇలియానా కూడా...ఒకసారి ఆండ్రూతో పెళ్లయినట్లు.. అతను తన భర్త అన్నట్లు మాట్లాడుతుంది. ఇంకోసారి ఇంకా తాము సహజీవనం మాత్రమే చేస్తున్నట్లు చెబుతుంది. ఈ విషయంలో మీడియాను కొన్ని నెలలుగా కన్ఫ్యూజ్ చేసేస్తోంది ఇలియానా.  ఇప్పుడు చాలా ఏళ్ల విరామం తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది ఇలియానా. ఈ నేపథ్యంలో  ‘అమర్ అక్బర్ ఆంటోని’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసినప్పుడైనా ఆమె స్పష్టత ఇస్తుందని ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తన పెళ్లిపై గందరగోళాన్ని మరింత పెంచిందామె. ఆండ్రూ గురించి సోషల్ మీడియాలో చాలానే చెప్పా.. కొత్తగా చెప్పేదేముంది.. దీని గురించి ఏమీ మాట్లాడను అంటూ మాట దాట వేసేసింది. దీంతో ఇక ఆమెను పెళ్లి గురించి ఏం అడగాలో మీడియా వాళ్లకు అర్థం కాలేదు. ఇక తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రచారాలు చేశారని అన్న ఇలియానా.. ఆ విషయాన్ని కన్ఫమ్ చేయలేదు. అలాగని ఖండించనూ లేదు. ఏవైనా రూమర్స్‌ వచ్చినప్పుడు వాటిని ఖండించకపోతే, అది ఒప్పుకున్నట్లే కదా! ఇలియానా పెళ్లి విషియం కూడా అలాగే వుంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.