ఇలియానాని టచ్‌ చేస్తే...మీ సమాచారం అంతా హ్యాకర్ల చేతుల్లోకి

16:39 - October 6, 2018

ఒకప్పుడు యూత్‌ను ఉర్రూతలూపిన గోవా బ్యూటీ ఇలియానా . అయితే ఇప్పడు ఈ ఇల్లీ బేబీ గురించి వెతకొద్దు, ఈమె ఫోటోలను, లింక్‌లను టచ్‌ చేయోద్దంటున్నారు సైబర్‌ సెక్యూరిటీ. ఇలియానా కోసం నెట్టింట్లో సెర్చ్ చేశారో.. ఇక అంతే సంగతులు. మీ ఫోన్‌లోని డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ' ఎంసీఏ ఫ్రీ ' స్వయంగా వెల్లడించింది. ఇప్పటి వరకూ అత్యంత ప్రమాదకర సెలబ్రిటీల జాబితాలో కపిల్ శర్మ ముందుండేవారు. తాజాగా ఆయన్ను దాటేసి ఇల్లీ బేబి మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీగా మారిపోయింది. అమ్మడికి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని హ్యాకర్లు ఇల్లీ బేబి ఫోటోలు, వార్తల్లో వైరస్‌లను జొప్పిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ కంపెనీ తెలిపింది. ఈ ముద్దుగుమ్మకు సంబంధించి వచ్చే ఫోటోలు, వార్తల లింక్‌లపై క్లిక్ చేస్తే కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలోని సమాచారం మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరిస్తోంది.