ఇప్పుడు సన్ని లియోన్‌ కాదట!...ప్రియా వారియరట!

14:35 - December 13, 2018

సన్నీలియోన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లే అయ్యింది. అప్పటి నుండి కూడా సన్నీలియోన్ ను గూగుల్ లో అత్యధికంగా ఇండియన్స్ సెర్చ్ చేస్తూ వచ్చారు. ఇండియాలో సన్నీలియోన్ గురించి వెదికే వారి సంఖ్య భారీగా ఉందని ఆమె టాప్ లో ఉందని గుగూల్ వరుసగా పలు సంవత్సరాలు ప్రకటించింది. గత ఏడాది కూడా సన్నీలియోన్ టాప్ లో కొనసాగిన విషయం తెల్సిందే. అఅయితే ఈ సారి మాత్రం ఆమెకు టాప్ 10 లో స్థానం దక్కలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థానం ప్రియా వారియర్‌దట!. అసలు విషియంలోకి వెలితే...సన్నీలియోన్ నెం.1 స్థానంను కేరళ ముద్దు గన్ ముద్దుగుమ్మ ప్రియావారియర్ సొంతం చేసుకుంది. చిన్న కన్నుగీటుతో ఒక్క ముద్దుగన్ను పేల్చి దేశం  మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేసుకున్న ప్రియావారియర్ 2018వ సంవత్సరంలో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన సెలబ్రెటీగా నిలిచింది. ప్రియావారియర్ నెం.1 అంటూ స్వయంగా గూగుల్ ప్రకటించింది. ఆ తర్వాత స్థానంలో అమెరికన్ సింగ్ ఇటీవలే మన పీసీని పెళ్లి చేసుకున్న నిక్ జొనస్ నిలిచాడు. పీసీని పెళ్లి చేసుకోబోతున్న నిక్ జొనస్ ఎవరు అతడేం చేస్తాడు అంటూ ఎక్కువ మంది తెగ వెదికేశారట. ఇక తరువాత స్థానాలకు వస్తే...

3. సప్న చౌదరి (బిగ్ బాస్ 11 పార్టిసిపెంట్ మరియు ఉత్తరాదిన మంచి స్టేజ్ డాన్సర్)
4. ప్రియాంక చోప్రా
5. ఆనంద్ ఆహుజా (బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ భర్త)
6. సారా అలీ ఖాన్ (బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది)
7. సల్మాన్ ఖాన్
8. మేఘన్ మార్కెల్ (బ్రిటన్ యువరాజు హ్యారీ పెళ్లి చేసుకున్న యువతి)
9. అనూప్ జలోట (65 ఏళ్ల వయస్సులో బిగ్ బాస్ 12 లో తెగ రొమాన్స్ చేసిన వ్యక్తి)
10. బోణీ కపూర్