ఇప్పుడు అభ్యర్థుల దారి పేటీఎం!

11:43 - November 27, 2018

ఎన్నికలు వచ్చాయంటే చాలు ఎప్పుడూ కనపడని నాయకులందరూ ఇంటింటికీ వెళ్లి మరీ కనపడి వస్తుంటారు. ఒక్కోక్కసారి ఓటేసిన ప్రజలు మళ్ళీ ఓటేసేటప్పుడు వారిని చూసే దుస్థితి కూడా వుంది. అయితే ఎన్నికల్లో డబ్బులు పంచడం అనేది అనాది కాలం నుంచీ వస్తున్నదే. ఈ పంచే వ్యవహారంలో ఎన్నికల సంఘం పరిమితిని విధిస్తుంది. అయితే ఆ పరిమితిలో పంచితే ఓట్లు పడతాయా పడవు, కాబట్టి అవతల పార్టీ వాడికన్నా మేము ఎక్కువ ఇచ్చి ఆ ఓటును వేయించుకోవాలి అనేది బరిలో వున్న అభ్యర్థులలో వుంటే ఆలోచన. మరి ఎలా పరిది దాటితే ఎన్నికల సంఘం కేసులు నమోదు చేస్తుంది. దీనికి పరిష్కారం ఏంటీ? అప్పుడే గుర్తొచ్చింది ఒక దారి అదే పేటిఎం. ఇక అభ్యర్థులు అదే దారి ఫాలో అవుతున్నారు. ఎన్నికల కమిషన్ కు చిక్కకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఎత్తులతో పెయిడ్ కార్యకర్తలకు - తమ వెంట నడిచే వారికి నేరుగా స్మార్ట్ ఫోన్ లోని వ్యాలెట్లు - యాప్ ల ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్  పట్నం నుంచి పల్లెదాక కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందులో పేటీఎం యాప్ సర్వసాధారణమైన విషయంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెసులు బాటు ఎన్నికల బరిలో నిలిచిన వారికి వరంగా మారింది. డబ్బుల పంపిణీకి అదే ఆయుధంగా పలువురు అభ్యర్థులు మార్చుకుంటున్నారు. అసలే ఉరుకుల పరుగుల జీవితంలో నేతల వెనుక తిరిగే కార్యకర్తలు తక్కువైపోతున్నారు. దీంతో పెయిడ్ కార్యకర్తలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. విద్యార్థులు - యువత - మహిళా సంఘాల సభ్యులు... చివరకు అడ్డా కూలీలను సైతం నేతలు వదలకుండా డబ్బులు ఇచ్చి తమ వెంట తిప్పుకుంటున్నారు. వీరిలో కూలీలను మినహియిస్తే... మిగతా వారికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా... అర్దరాత్రి దాటిన తర్వాత పేటీఎం ద్వారా పంపిస్తున్నారు. తమ వెంట వచ్చిన వారి వివరాలు తీసుకుని... వారి పేటీఎం నంబర్ సేకరించి... గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.