ఇప్పుడవన్నీ ఎందుకంటున్న రష్మిక..

11:43 - September 23, 2018

రష్మిక ఇప్పుడున్న హీరోయిన్స్‌లో బాగా పాపులర్‌గా వున్న ఒక హీరోయిన్‌ ఈమె. ' ఛలో ', ' గీతా గోవిందం ' తో అమ్మడు బాగా పాపులర్‌ అయింది. కొద్ది కాలంలోనే ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకున్న ఈమె...అంతలోనే రక్షిత్‌ అనే యువకుడితో నిశ్చితార్ధం చేసుకుంది. ఇక రక్షిత పెండ్లిపీటలు ఎక్కుతుందీ అని అనుకుంటున్న సందర్భంలో...అకస్మాత్తుగా రష్మిక- రక్షిత్‌లు తమ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. వెంటనే ఆ వార్తలను నిజం చేస్తూ రష్మిక తల్లి కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ అమ్మడు నాగార్జున, నానీ నటిస్తున ' దేవదాసు 'సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. అయితే తాజాగా ఈ చిత్రం ప్రమోషన్‌లో ఈ అమ్మడు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రష్మికను నిశ్చితార్ధం రద్దు గురించి అడగగా... దీనిపై స్పందించిన రష్మిక '' ఈ విషయం గురించి మీరు రెండు నెలల ముందు గనక అడిగుంటే  'అయ్యో.. అలాంటిదేమీ లేదని చెప్పేదాన్ని'. కానీ ఇప్పుడు మాత్రం నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను. ఒకవేళ అలాంటివి చెప్పాల్సి వస్తే సోషల్ మీడియా వేదికగా చెబుతాను. అంతేకానీ సినిమా ప్రమోషన్స్‌లో ఇలాంటివి ఎందుకు'' ?అని బదులిచ్చారు.