ఇప్పటిదాకా ' డీజే '..ఇప్పుడు ' గీత గోవిందం '

14:24 - September 23, 2018

' గీత గోవిందం ' విడదులై నాలుగు వారాలవుతున్నా...కలెక్షన్ల పరంపర కొనసాగుతూనే వుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో విజయ్ దేవరకొండ ఒక ఊపు ఊపేస్తున్నాడు. కొందరు స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని 20 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పటి వరకు నైజాం ఏరియాలో 20 కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించిన చిత్రాలు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. తాజాగా గీత గోవిందం ఆ జాబితాలో చేరడంతో ఆ సంఖ్య 8 కి చేరింది. ఇప్పటి వరకు 20.30 కోట్లతో అల్లు అర్జున్ నటించిన ‘డీజే’ చిత్రం 7వ స్థానంలో ఉంది. 20.20 కోట్లతో ‘గీత గోవిందం’ చిత్రం 8వ స్థానంలో ఉంది. ఇంకా కూడా గీత గోవిందంకు షేర్ వస్తున్న కారణంగా మరికొన్ని రోజుల్లో ‘డీజే’ రికార్డును గీత గోవిందం బ్రేక్ చేసే అవకాశం ఉంది. 7వ స్థానంలో ఉన్న ‘డీజే’ చిత్రం అతి త్వరలోనే 8వ స్థానంకు చేరే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. మరో పది లక్షల రూపాయల షేర్ ను రాబట్టడం ఏమంత పెద్ద కష్టం కాదు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి ఏమీ లేకపోవడంతో పాటు ఉన్న చిన్న చిత్రాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలం అవుతున్న కారణంగా గీత గోవిందం చిత్రం లాంగ్ రన్ లో మరో 25 లక్షల వరకు షేర్ ను దక్కించుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటూ ట్రేడ్ పండితులు అంటున్నారు.