ఇప్పటికీ తెలియని బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి చంద్రముఖి ఆచూకీ!..

12:28 - November 28, 2018

తెలంగాణకు జరుగుతున్న ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన హిజ్రా మువ్వల చంద్రముఖి నిన్న ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. రెండు రోజులు గడుస్తున్నప్పటికీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఎన్నికల కమీషన్‌ రంగంలోకి దిగింది. చంద్రముఖి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారగా, మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖను ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే చంద్రముఖి తల్లి తన బిడ్డ కనిపించడం లేదంటూ  ఈ ఉదయం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇదిలా వుంటే చంద్రముఖి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.