ఇదేం రొమాన్స్‌ రజినీజీ...!

12:15 - December 19, 2018

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరు పదుల వయస్సు ఎప్పుడో దాటాడు త్వరలోనే ఏడు పదుల వయసు కు చేరువ కాబోతున్నాడు. ఈ వయస్సు లో కూడా రజినీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు రజినీ చేసే సినిమాలో హీరోయిన్స్‌ వయసు...రజినీ వయసుకుంటే దగ్గర దగ్గరగా మూడింతలు తక్కువగా వుంది. సర్కార్ చిత్రం తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మురుగదాస్ ప్రస్తుతం రజినీకాంత్ కోసం స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్నాడు.సర్కార్ చిత్రం తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మురుగదాస్ ప్రస్తుతం రజినీకాంత్ కోసం స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. వచ్చే నెలలోనే వీరి కాంబో మూవీ పట్టాలెక్కనుంది అంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ ను మురుగదాస్ ఎంపిక చేయడం రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. రజినీకాంత్ వయస్సు 68 యేళ్లు కాగా- కీర్తి సురేష్ వయస్సు 26 యేళ్లు. ఇద్దరి మద్య వయస్సు చాలా తేడా ఉంది. రజినీకాంత్ కూతుర్ల కంటే కూడా కీర్తి సురేష్ వయస్సు దాదాపుగా పదేళ్లకు పైగా తక్కువ ఉంది. కూతుర్ల వయస్సు కంటే చాలా తక్కువ వయసు ఉన్న అమ్మాయి తో రొమాన్స్ ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. రజినీకాంత్ కు మూడు పదుల వయసు దాటిన హీరోయిన్స్ అయితే కాస్త పర్వాలేదు కాని పాతికేళ్ల వయస్సు హీరోయిన్ తో రొమాన్స్ ఏంటీ అంటూ ఫ్యాన్స్ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.