ఇక సైలెన్స్‌ అంటున్న అనుష్క!

16:40 - November 13, 2018

భాగమతి తరువాత అనుష్క చాలా గ్యాప్‌ తీసుకుంది. ' సైజ్‌ జీరో ' చిత్రం తీశాక అనుష్క చాలా బరువు పెరిగింది. ఆ బరువును తగ్గించుకునేందుకు ఆస్ట్రేలియాలో నేచురోపతి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుంది. అయితే ఇంత గ్యాప్‌ తరువాత కూడా ఇంకా ' సైలెన్స్‌ ' అంటుంది అనుష్క. అయితే ఈ సైలెన్స్‌ కి అర్థం మాట్లాడొద్దు అని కాదండీ...' సైలెన్స్‌ ' సినిమా అంట!.  అనుష్క , మాధవన్‌తో కలిసి మధుకర్ దర్శకత్వంలో నటించబోతోంది. ఈ చిత్రానికి ' సైలెన్స్‌ ' అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్ చేసినట్టు సమాచారం. 2019 ప్రారంభంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. అయితే షూటింగ్ మొత్తం దాదాపు అమెరికాలోనే ఉంటుందని టాక్. ఈ చిత్రంలో హాలీవుడ్ షేడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయట. కాబట్టి హాలీవుడ్ నటీనటులను ఎక్కువగా తీసుకుంటున్నారని సమాచారం. తెలుగు, తమిళ్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది.