ఇక విజయవాడలోనే...

14:14 - September 3, 2018

కత్తి మహేష్  ఇక నుండి విజయవాడలోనే ఉండనున్నారు. తాజాగా తన మకాం విజయవాడలోనే అని ఒక ప్రకటన చేశారు. తాను అంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తినేనని... తనపై హైదరాబాదు సిటీ నిషేధం మాత్రమే ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో కాకుండా ఇంకా ఎక్కడైనా నివసించవచ్చని... తాను అంధ్రప్రదేశ్‌కి చెందిన వాడిని కాబట్టి ఇక నుంచి విజయవాడలో ఉండేందుకు గన్నవరం వచ్చానని... సోమవారం కత్తి మహేష్. మీడియాతో ముచ్చటించారు.

శ్రీరామునిపై కత్తి మహేష్‌ మాట్లాడిన మాటలకి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్..కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ విధించిన విషయం విషయం తెలిసిందే. దీంతో కొంతకాలంగా ఆయన బెంగుళూరులోనే ఉన్నారు.