ఇక వాట్సప్‌లో వీడియోలు చూస్తూ కూడా చాటింగ్‌ చేయొచ్చు!

17:28 - December 18, 2018

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ 'పిక్చర్ ఇన్ పిక్చర్' పేరిట కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో ఇతరులతో చాటింగ్ చేస్తూనే థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వీడియోలని వాట్సాప్ లోనే ప్రత్యేక విండోలో చూసేయొచ్చు.  ప్లేస్టోర్ లో వర్షన్ 2.18.380 కి అప్ డేట్ చేసుకున్నవాళ్లు ఈ సదుపాయాన్ని పొందుతారు. కాగా, ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.