ఇక ఫైనల్‌కు ఎన్టీఆరేనా...?

12:10 - September 24, 2018

 బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 కు ఇంకొక్క వారమే మిగిలింది. ఇక హౌజ్‌లో వున్న సభ్యులు 5గురు వీరిలో ఈ వారంలో ఎవరు గెలుస్తారో..ఎవరు బిగ్‌బాస్‌ టైటిల్‌ను గెలుచుకుంటారో అని అందరూ వేచి చూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఫైనల్ ఎపిసోడ్ కు ప్రత్యేక గెస్ట్ హాజరు కాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. మొదట నాగార్జున బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో పాల్గొని విజేతను ప్రకటించడంతో పాటు బిగ్ బాస్ టైటిల్ ను కూడా ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ‘దేవదాస్’ ప్రమోషన్స్ కోసం నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చేశాడు. నిన్నటి ఎపిసోడ్ లో కొన్ని నిమిషాల పాటు నాగార్జున ఇలా వచ్చి అలా వెళ్లి పోయాడు. దీంతో నాగార్జున ఫైనల్ ఎపిసోడ్ కు రాకపోవచ్చు అని తేలిపోయింది.  అరవింద సమేత చిత్రం షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ఎన్టీఆర్ విదేశాల్లో ఉన్నాడు. మరో రెండు మూడు రోజుల్లోనే టీం మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకుని రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అంటే ఫైనల్ ఎపిసోడ్ టైం కు ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే ఉండే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 2 విజేతను ప్రకటించేందుకు వస్తాడా అనేది అందరిలో చర్చనీయాంశం అవుతుంది.   ఎన్టీఆర్ వస్తే మాత్రం బిగ్ బాస్ సీజన్ 2 కూడా సూపర్ హిట్ అయినట్లే అంటూ నందమూరి అభిమానులు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!