ఇక ఆ సినిమా చేయను: కీర్తి సురేష్‌

17:23 - December 3, 2018

కీర్తి సురేష్ తన మొదటిసినిమా 'నేను శైలజ'తోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తరువాత వచ్చిన సినిమాలు అంతగా అడకపోయినా..' మహానటి ' సినిమాతో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకుంది. అంత బాగుంది గానీ ఇంతవరకూ తన తెలుగు డెబ్యూ కావలిసిన చిత్రం మాత్రం ఇంతవరకూ కంప్లీట్ కాలేదు. సీనియర్ హీరో నరేష్ తనయుడు నవీన్ హీరోగా - కీర్తి సురేష్ హీరోయిన్ గా ఒక సినిమా రెండేళ్ళ క్రితం మొదలుపెట్టారు.  ఆ సినిమా లాంచ్ ఈవెంట్ కు ఆతరం ఈతరం సూపర్ స్టార్లయిన కృష్ణ.. మహేష్ బాబులు హాజరయ్యారు.  ప్రారంభం బాగానే ఉన్నా సినిమా 30% షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయింది. అర్థాంతరంగా ఆగిపోయిన ఆ సినిమాను నిర్మాతలు మళ్ళీ పట్టాలెక్కించాలని చూస్తున్నారట.  అదే విషయం కీర్తితో చెప్తే.. ఈ సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఈ సినిమాలో నటించనని.. ఈ సినిమాకు తీసుకున్న అడ్వాన్సు తిరిగి ఇచ్చేస్తానని అంటోందట.  కానీ నిర్మాతలేమో కీర్తి సురేష్ కి ఇప్పుడు మంచి పాపులారిటీ ఉంది కాబట్టి తమ సినిమాకు క్రేజ్ ఉంటుందని ఎలాగైనా అమెను సినిమాలో నటింపజేయాలని చూస్తున్నారట.