ఇకపై స్పీడ్‌గా రానున్న ప్రభాస్‌ సినిమాలు

14:04 - September 6, 2018

దాదాపు ఏడు సంవత్సరాల్లో కేవలం  ‘బాహుబలి’ మరియు సాహో చిత్రాలకే ప్రభాస్ సమయం అంతా కేటాయించాడు. అందుకే ఇకపై చాలా స్పీడ్ గా సినిమాలు చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘సాహో’ చిత్రం పూర్తి కాకుండానే తదుపరి చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభాస్ తదుపరి చిత్రం త్రిభాష చిత్రంగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో తనకు జోడీగా పూజా హెగ్డే నటించబోతున్నట్లుగా ప్రభాస్  క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంకు కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా ప్రభాస్ పేర్కొన్నాడు. గోపీ కృష్ణతో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ చిత్రంను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. 

 ఒక వైపు సాహో చిత్రీకరణలో పాల్గొంటూనే మరో వైపు ప్రభాస్ తన తదుపరి చిత్రానికి 10 కేజీల వరకు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తెలుగుతో పాటు హిందీ మరియు తమిళంలో కూడా తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రానుందో లేదంటే 2020 వరకు వేచి చూడాలో అంటూ ఫ్యాన్స్లో చర్చ మొదలైంది.