ఇంతకీ ఎవరు వస్తున్నారు?

15:01 - September 12, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా అరవింద సమేత. ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 20న  గ్రాండ్‌గా నిర్వహించాలనుకుంటున్నట్టు సమచారం. అయితే ఈ వేడుకకు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు నందమూరి బాలకృష్ణ వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరు వస్తున్నారు ? .లేదంటే ఇద్దరూ వస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉంది. అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.