ఆ హీరోయిన్‌ ఆత్మహత్య చేసుకుంది అందుకేనా?

13:35 - December 1, 2018

తమిళ హీరోయిన్ రియామిక ఆత్మహత్యకు పాల్పడినది. కుమారసుక్కు కొండట్టమ్ అగోరియన్ అట్టన్ చిత్రాలతో కీలక పాత్రలో నటించడంతో పాటు ఇంకా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన రియామికకు గత కొన్నాళ్లుగా అస్సలు ఆఫర్లు దక్కలేదు. అవకాశాలు లేకపోవడం వల్లే రియామిక గత కొన్నాళ్లుగా డిస్ట్రబ్ గా ఉంటుందట. మానసిక ఒత్తిడితో ఆమె తన బెడ్ రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందట. ప్రస్తుతం తన సోదరుడు ప్రకాష్ తో కలిసి నివాసం ఉంటున్న రియామిక దినేష్ అనే వ్యక్తితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. దినేష్ తో ఎప్పుడు కూడా ఆఫర్లు రావట్లేదని చెప్పుకుని బాధపడేదట. పోలీసుల కథనం ప్రకారం.. ఆరోజు ఉదయాన రియామికను కలిసేందుకు దినేష్ ఇంటికి వచ్చాడట. ఏదో విషయమై దినేష్ తో రియామిక గొడవ పెట్టుకుందట. దాంతో దినేష్ ఆమె రూం నుండి బయటకు వచ్చి ప్రకాష్ కు వంట చేయడంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే రియామిక తన బెడ్ రూంలో ఉరి వేసుకుందట. తలుపులు ఎంత కొట్టిన తీయక పోవడంతో అనుమానం వచ్చి తలుపు పగులగొట్టగా ఆమె ఉరి వేసుకుని కనిపించిందని దినేష్ మరియు ప్రకాష్ లు పోలీసులకు తెలియజేశారట. రియామిక ఫోన్ ను స్వాదీనం చేసుకున్న పోలీసులు ఆ రూంలో సెర్చ్ చేశారట. ఆమె ఆత్మహత్య కేసును ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆఫర్ లు లేకపోవడం వల్లే ఆమె ఆత్మ హత్య చేసుకుని ఉంటుందని అంతా అంటున్నారు. ఇదిలా వుంటే... రియామిక మరణంతో ఇండస్ట్రీలో ఆమెకు సన్నిహితంగా ఉండే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.