ఆ హీరోకి ఈగో జీరో...

15:08 - September 10, 2018

హీరో నాగ చైతన్యకు అసలు ఈగో లేదు అని హీరోయిన్‌  అను ఇమ్మాన్యుయేల్ అంటుంది. 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో ఫుల్లుగా ఈగో ఉన్న పిల్లగా నటించిన అను ఇమ్మాన్యుయేల్  తన హీరో నాగ చైతన్యకు ఈగో విషయంలో జీరో మార్కులు ఇచ్చింది.  టాలీవుడ్ లో ఉన్న జీరో ఈగో హీరో చైతు అని చెప్పింది. సెట్ లో అందరినీ ఒకేరకంగా ట్రీట్ చేస్తాడని.. ఎవరిపై కూడా ఈగో చూపించడం గమనించలేదని చెప్పింది. 
'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో చైతు క్యారెక్టర్ రియల్ లైఫ్ లో చైతు క్యారెక్టర్ కు అసలు తేడా లేదట.   అందువల్లే చైతు ఈ సినిమా జీరో ఈగో హీరో పాత్రలో చాలా న్యాచురల్ గా కనిపించాడట.  అసలు అది నటించడం అనే కంటే తన రియల్ క్యారెక్టర్ ఎలా ఉందో అలా బిహేవ్ చేసినట్టుగా ఉంది అని చైతు పై అను ప్రశంసలు కురిపించింది.  నిజమే.. దాదాపు పదేళ్ళ కెరీర్ లో చైతు ఎలాంటి వివాదాల్లో ఇరుక్కోలేదు. ఎవరినీ ఇబ్బందిపెట్టినట్టుగా కూడా వార్తలు రాలేదు.