ఆ స్టెప్స్‌కు 17 ఏళ్లు

14:50 - October 4, 2018

మీకు గుర్తుందా చిరంజీవి గారి ' డాడీ ' సినిమాలో అల్లూ అర్జున్‌ వేసిన స్టెప్‌..ఆ దానికి ఈనాటికి 17 ఏళ్లు. బన్ని హీరో అయ్యింది `గంగోత్రి` చిత్రంతో. 2003లో ఈ సినిమా రిలీజైంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిక్కరుతో కనిపించి ఒక సాధాసీదా బోయ్ గా ఎంతో సహజంగా నటించాడు. వాస్తవానికి అల్లు అర్జున్ రెండేళ్ల వయసు బాలకుడిగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబినేషన్ మూవీ `విజేత`లో అప్పియరెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 2001లో మెగాస్టార్ చిరంజీవి `డాడి` చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్నాడు. అప్పటికి నూనూగు మీసాల యువకుడిగా అథ్లెటిక్ లుక్ తో బన్ని ఇచ్చిన ఎంట్రీ అందరినీ ఆకర్షించింది. నేడు టాలీవుడ్ సహా ఇండియా వైడ్ రికగ్నిషన్ ఉన్న స్టార్ గా బన్ని అవతరించాడు. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు తేగలిగే స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నాడు. బన్ని స్టైలిష్ డ్యాన్సింగ్ డెబ్యూ ఇచ్చిన `డాడి` సినిమా రిలీజై ఏకంగా 17 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆ యూట్యూబ్ లింక్ ను షేర్ చేస్తున్నారు. నేడు సౌత్ ఇండస్ట్రీలోనే డ్యాన్సింగ్ స్టార్ గా - స్టైలిష్ స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకున్న బన్ని ఎప్పుడూ తన మూలాల్ని మర్చిపోడు. మెగాస్టార్ చిరంజీవి అనే వృక్షం కింద సేద దీరే బాటసారులం మేమంతా! అని వినమ్రంగా చెబుతాడు బన్ని. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా మావయ్య అంటే ప్రేమాభిమానాలతో కూడుకున్న గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు. చిరు బాటలోనే క్రమశిక్షణను అలవాటు చేసుకుని తాను ఇంత ఎదిగానని గర్వంగానే చెప్పుకుంటాడు.