ఆ సినిమాలో ముచ్చటగా ముగ్గురు ముద్దుగమ్మలట!

12:40 - September 29, 2018

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న అరవింద సమేత వీరరాఘవ రిలీజ్‌కు ఇంకా ఎన్నో రోజులు లేవు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల కాంభినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని,   పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రంపై నందమూరి ఫ్యాన్స్ లో అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మొదటి నుండి కూడా ఇద్దరు హీరోయిన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. పూజా హెగ్డేతో పాటు ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అయితే వీరిద్దరు కాకుండా ఈ చిత్రంలో మరో ముద్దుగుమ్మ కూడా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. తెలుగులో ఇప్పటికే ‘ఓమై గాడ్’ - ‘అనగనగా ఒక చిత్రం’ - ‘ఖాకీ’ల్లో కనిపించిన కన్నడ ముద్దుగుమ్మ మేఘ శ్రీ తాజాగా ఈ చిత్రంలో నటించినట్లుగా సమాచారం అందుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక కీలకమైన రోల్ లో మేఘ శ్రీ కనిపించబోతుందని ఎన్టీఆర్ మరియు ఈమె కాంబోలో ఎలాంటి సీన్స్ ఉంటాయో ఇంకా క్లారిటీ లేదు. త్రివిక్రమ్ ఈసారి ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలను రంగంలోకి దించడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.