ఆ లిస్టులో నెం.1 పవన్‌ కళ్యాణేనట!

17:14 - December 5, 2018

ప్రతి ఏడాదీ ఫోర్బ్స్ లిస్టు వస్తోందంటే అందరూ ఆసక్తిగా చూస్తారు.  ఈ ఏడాది కూడా ఫోర్బ్స్ ఇండియా ఆదాయం విషయంలో టాప్-100 సెలబ్రెటీల లిస్టు విడుదల చేసింది.  ఎవరి ఆదాయం ఎంత.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అని ఆసక్తిగా పరిశీలిస్తారు. ఇందులో టాలీవుడ్ నుంచి నంబర్ వన్ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలవడం విశేషం. సినిమాల నుంచి విరమించుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటికీ పవన్ ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి అగ్రస్థానాన నిలవడం విశేషమే. పవన్ తర్వాత టాలీవుడ్ నుంచి అత్యుత్తమ స్థానం జూనియర్ ఎన్టీఆర్ దే. అతను 28వ ర్యాంకులో ఉన్నాడు. విక్రమ్ 29వ స్థానం సాధించగా.. మహేష్ బాబు 33వ ర్యాంకులో ఉన్నాడు. సూర్య కు 34వ స్థానం దక్కింది. విజయ్ సేతుపతి 35.. అక్కినేని నాగార్జున 36.. కొరటాల శివ 39.. ధనుష్ 53.. సైనా నెహ్వాల్ 58.. అల్లు అర్జున్ 64.. నయనతార 69.. కమల్ హాసన్ 71 ర్యాంకుల్లో నిలిచారు. రామ్ చరణ్.. విజయ్ దేవరకొండ సమానంగా 72వ స్థానంలో ఉండటం విశేషం. ఇండియా మొత్తంగా చూసుకున్నట్లయితే...ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇండియా నంబర్ వన్ రిచెస్ట్ సెలబ్రెటీగా నిలవడం విశేషం. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానం సాధించాడు. ఆ తర్వాత వరుసగా అక్షయ్ కుమార్.. దీపికా పదుకొనే.. ఎం.ఎస్.ధోని.. ఆమిర్ ఖాన్.. అమితాబ్ బచ్చన్.. రణ్వీర్ సింగ్.. సచిన్ తెందుల్కర్.. అజయ్ దేవగణ్ ఉన్నారు. ఇదీ టాప్-10 జాబితా. సూపర్ స్టార్ రజనీకాంత్ 14వ స్థానంలో నిలిచాడు. మరో కోలీవుడ్ స్టార్ విజయ్ 26వ స్థానంలో ఉన్నాడు.