ఆ రెండూ..కలియుగ కైకేయిలు: రాన్‌ దీప్‌

15:59 - October 4, 2018

ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి కానీ వీటి మీద రాజకీయ లబ్ధి పొందడం కామన్‌గా మారిపోయింది తప్ప వీటి పరిష్కారం మాత్రం జరగటం లేదు. ఇప్పుడు ఈ విషియాలు ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా?.. పరిస్థితులు వచ్చాయి కాబట్టేనండి. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన నేపథ్యంలో తాజాగా బీజేపీ పరివారం రామజన్మభూమి అంశాన్ని తెర మీదకు తెచ్చింది. రామజన్మభూమి వ్యవహారంపై బీజేపీ నేతలు అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేత రాన్ దీప్ సుర్జేవాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ రెండూ కలియుగ కైకేయిలుగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల ముందు వారికి రామజన్మభూమి అంశం గుర్తుకు వస్తుందన్నారు. సత్య యుగంలో కైకేయి కేవలం 14 ఏళ్లు మాత్రమే రామున్ని రాజ్య బహిష్కరణ చేసిందని.. కానీ కలియుగ కైకేయిలు అయిన బీజేపీ..సంఘ్ లు మాత్రం 30 ఏళ్లుగా రాముడ్ని బహిష్కరించారన్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు మాత్రమే వారికి రాముడు గుర్తుకు వస్తారని.. ఎన్నికలు అయిపోయిన వెంటనే రాముడ్ని వదిలేస్తారన్న ఆయన.. బీజేపీ.. సంఘ్ పరివార్ లు వానాకాలంలో అరిచే కప్పలుగా అభివర్ణించారు. వారుఊరికే బెక బెక మంటారే కానీ.. వారి చేతుల్లో ఏమీ ఉండవని చెప్పారు.